Sri Simha | మత్తు వదలరా వంటి వనూత్న కథతో ఎంట్రీ ఇచ్చి తొలి అడుగులోనే సక్సెస్ అయ్యాడు శ్రీసింహ. యంగ్ టాలెంట్ అంతా కలిసి కష్టపడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఆ తర్వాత అదే స్పీడ్‌తో తెల్లవారితే గురువారం అనే రోమ్ కామ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటికే ఎన్నో సార్లు చూసేసిన కథ కావడంతో ఈ సినిమాను జనాలు తిప్పికొట్టారు. కట్ చేస్తే రెండు వారాల్లోనే ఆహాలో సందడి చేసి అక్కడ కూడా మంచి వ్యూస్ రాబట్టలేకపోయింది. ఆ తర్వాత దొంగలున్నారు జాగ్రత్త వంటి సర్వైవల్ థ్రిల్లర్‌తో వచ్చి మరో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ఇక ఇటీవలే భారీ అంచనాలు పెట్టుకున్న భాగ్‌సాలే సైతం శ్రీ సింహకు డిజాస్టర్ ఫలితాన్నిచ్చింది.
ప్రస్తుతం శ్రీ సింహా ఆశలన్నీ ఉస్తాద్ సినిమాపైనే ఉన్నాయి. ఫనిదీప్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. ట్రైలర్‌తో సినిమాపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. బైక్‌ను పిచ్చ పిచ్చగా ప్రేమించే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఎంతలా ఉంటే ఆ బైక్ రైడింగ్ మీద ఉన్న ఇష్టమే అతన్ని పైలెట్ అయ్యేలా ప్రేరేపించేంతలా. కాగా ఆ జర్నీలో అతడికి ఎదురయ్యే సవాళ్లేంటి అనే లైన్‌తో ఈ సినిమా సాగింది. ఇదే కథకు ప్రేమను, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను యాడ్ చేశాడు దర్శకుడు. ఇందులో మరో విశేషమేంటంటే. హీరోకు అమితమైన కోపం. ఆ కోపం వల్ల తన గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదరయ్యాయి అనే సబ్ స్టోరీను కూడా ట్రైలర్లో చూపించాడు.
మొత్తంగా చూసుకుంటే ట్రైలర్ పర్వాలేదనిపిస్తుంది. ఇప్పటికే చూసిన కథలా అనిపించినా.. ట్రైలర్ కట్ చేసిన విధానం భాగుంది. ముఖ్యంగా శ్రీ సింహా క్యారెక్టర్ అదిరిపోయేలా డిజైన్ చేసినట్లు ట్రైలర్‌తో స్పష్టమయింది. బలగంతో సాలిడ్ హిట్ కొట్టిన కావ్యా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆగస్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఆ ముందు రోజే భోళా శంకర్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకైతే పెద్దగా అంచనాల్లేవు కానీ.. బాస్ సినిమా కాబట్టి సినిమా ఎలా ఉన్నా ఫస్ట్ వీకెండ్ మాత్రం వీర లెవల్లో హంగామా ఉంటుంది. మరీ మెగాస్టార్ పోటీని తట్టుకుని శ్రీ సింహా నిలుస్తాడా? లేదా? అనేది చూడాలి.