Ustaad Bhagat Singh | రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఎలాంటి సినిమాలకి సైన్ చేయకపోయిన ఇంతకముందు కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు.
అయితే ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా ఇటీవల సాగింది. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ మా ఆరవ సినిమాగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాబోతోంది. పవన్ సినిమా అంటే ఏ పాన్ ఇండియా బజ్ కూడా సరిపోదు అని అన్నారు. హరిష్ శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టగా, కథ ఓ రేంజ్లో ఉంది.ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారా అని మేము ఎదురు చూస్తున్నాము.
ఏది ఏమైన కూడా ఆ మూవీ షూటింగ్ ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేస్తాము .2025 మైత్రికి ఓ ప్రెస్టీజియస్ ఇయర్ కాబోతోంది. ఈ మూవీతో మేము నెక్స్ట్ లెవెల్లో ఒక కొత్త అచీవ్మెంట్ అందుకోబోతున్నాం అంటూ మెగా ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పారు నిర్మాత రవిశంకర్. అయితే నిర్మాత చెప్పిన ప్రకారం చూస్తే స్క్రిప్ట్ మాత్రం చాలా వరకు మార్చి కొత్తగా రూపొందించారని అనిపిస్తుంది. గతంలో ఉస్తాద్ భగత్ సింగ్ విజయ్ తేరి సినిమా రీమేక్ అని, ఎన్నికల ముందు పవన్ కి ఉపయోగపడేలా డైలాగ్స్ రాసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే తేరి బాలీవుడ్ రీమేక్ ఫ్లాప్ అవ్వడంతో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ మార్చి కొత్త స్క్రిప్ట్ రెడీ చేశాడనే ప్రచారం నడుస్తుంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.