‘ఓజీ’తో ఘనవిజయాన్ని అందుకున్న పవన్‌కల్యాణ్.. అదే జోష్‌లో తన నెక్ట్స్ సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ని కూడా పూర్తి చేసేశారు. రీసెంట్గా ఆ సినిమాకు సంబంధించిన పవన్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇక డబ్బింగ్ చెప్పడమే తరువాయి. మరోవైపు దర్శకుడు హరీశ్‌శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా శరవేగంగా కనిచ్చేస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ని ఇప్పటికే షురూ చేశారు. విడుదల తేదీ ప్రకటించగానే ప్రమోషన్స్‌ని వేగవంతం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. శ్రీలీల, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అయనంకా బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్,