Pawan Kalyan | పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఇప్పుడు అంత ఈజీ కాదనే విషయం నిర్మాతలకు కూడా తెలుసు. ఆయన రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నాడో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి టైంలో ఒప్పుకున్న సినిమాలకు ఆయన డేట్స్ ఇస్తాడు అని ఊహించడం అత్యాశే అవుతుంది. పవన్ తో సినిమా చేయాలంటే ఒకటి ఎదురు చూసే ఓపికైనా ఉండాలి.. లేదంటే ఆయనను వదిలేసి మరో సినిమా చేసే ధైర్యమైనా ఉండాలి. ఈ రెండు లేకపోతే ఏళ్ల తరబడి ఆయన కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లిస్టులో ఇప్పటికే క్రిష్, హరీశ్ శంకర్ లాంటి దర్శకులున్నారు.
మూడు నాలుగు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సినిమాతోనే బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు దర్శకులు. కానీ అటు క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు.. ఇటు హరీశ్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ రెండు పూర్తి కాలేదు. ఇంకా చెప్పాలంటే మూడేళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమలు కనీసం 50% షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. మరోవైపు ఉస్తాద్ కూడా పది రోజులకు మంచి షూటింగ్ జరగలేదు. కానీ వీటి తర్వాత పవన్ ఒప్పుకున్న భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో లాంటి సినిమాలు పూర్తి అయిపోయాయి. ఓజీ కూడా ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో 15 రోజులు పవన్ కళ్యాణ్ దయ తలిస్తే షూటింగ్ పూర్తి అయిపోతుంది.. సినిమా డిసెంబర్ లో విడుదల అయిపోతుంది.
ఇదంతా బాగానే ఉంది.. కానీ హరిహర వీరమల్లు, ఉస్తాద్ మాత్రం తాను ఇప్పట్లో చేయలేనని నిర్మాతలకు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయం AM రత్నం కూడా చెప్పాడు. ఏపీలో ఎన్నికలు అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారం జరిగితే వీరమల్లు షూటింగ్ అయిపోతుంది. లేదంటే వచ్చే ఏడాది ఆ సినిమా సంగతి చూసుకుంటామని చెప్పాడు రత్నం. ఈ లెక్కన ఈ సంవత్సరం వీరమల్లు సినిమా వైపు పవన్ కళ్యాణ్ వెళ్లడనే విషయం అర్థం అయిపోతుంది.
మరోవైపు హరీశ్ శంకర్ సినిమా ముచ్చట కూడా అంతే. అందుకే రవితేజకు ఓ కథ చెప్పి ఒప్పించాడు ఈయన. పవన్ పొలిటికల్ టెన్షన్స్ అన్ని పూర్తయిన తర్వాత ఉస్తాద్ మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఆ లోపు కుదిరితే రవితేజ సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు హరీశ్. ఈ లెక్కన 2023లో పవన్ కళ్యాణ్ నుంచి బ్రో, ఓజీ మాత్రమే వస్తాయి. మిగిలినవన్నీ ఎన్నికల తర్వాత చూసుకుందామని క్లారిటీ ఇచ్చేశాడు జనసేనాని.
Baby Movie | బేబీ పయనం ఇంకా ఎంత దూరం.. ఫుల్ రన్ లో 30 కోట్లు వస్తాయా..?
Devara Movie | దేవరలో అల్లు అర్జున్ గారాల పట్టి.. రెండో సినిమాకే భారీ రెమ్యునరేషన్