Baby Movie | బేబీ పయనం ఇంకా ఎంత దూరం.. ఫుల్ రన్ లో 30 కోట్లు వస్తాయా..?
Baby Movie | హిట్.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్.. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్.. ఇలా ఓ సినిమా విజయానికి ఎన్ని కొలమానాలున్నాయో అన్నీ బేబీ సినిమాకు సరిపోతాయి. అసలు ఈ సినిమా కలెక్షన్స్ రేంజ్ చూసి అందరికీ కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. కచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయని అందరూ అనుకున్నారు.
Baby Movie | హిట్.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్.. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్.. ఇలా ఓ సినిమా విజయానికి ఎన్ని కొలమానాలున్నాయో అన్నీ బేబీ సినిమాకు సరిపోతాయి. అసలు ఈ సినిమా కలెక్షన్స్ రేంజ్ చూసి అందరికీ కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. కచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయని అందరూ అనుకున్నారు.. కానీ నిర్మాతలు కూడా నిర్ఘాంతపోయేలా.. బాక్సాఫీస్ దుమ్ము దులిపేలా బేబీ సినిమాకు కలెక్షన్స్ వస్తాయని ఊహిచంలేదు. మొదటిరోజు దాదాపు 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. మూడో రోజు 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. సాధారణంగా మొదటి సోమవారం ఏ సినిమాకైనా కలెక్షన్స్ తగ్గుతాయి. కానీ బేబీ సినిమాకు మాత్రం ఊహించని విధంగా వచ్చాయి.
యూత్ కు కనెక్ట్ అవుతుందని తెలుసు కానీ మరి ఈ రేంజ్ లో కనెక్ట్ అవుతుంది అని దర్శక నిర్మాతలు కూడా ఊహించలేదు. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూసి దర్శకుడు సాయి రాజేశ్ కూడా షాక్ అయ్యాడు కచ్చితంగా వర్కింగ్ డే కలెక్షన్స్ తగ్గుతాయని అనుకున్నాను.. కానీ ఈ రేంజ్ లో బేబీ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుందని ఊహించలేదు అంటూ సాయి రాజేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్నిబట్టి సినిమా రేంజ్ ఏంటో అర్థం అవుతుంది. కచ్చితంగా నాలుగో రోజు కూడా 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది ఈ సినిమా. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ లాభాల పంట పండిస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోవడమే కాదు.. 4 కోట్ల లాభాలు కూడా తీసుకొచ్చింది బేబీ. దీని దూకుడు చూస్తుంటే మరో 15 కోట్ల షేర్ ఈజీగా వచ్చేలా కనిపిస్తోంది. ఇదేగాని జరిగితే 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి.. ఈ సంవత్సరం కాదు గత కొన్ని సంవత్సరాలుగా మరే చిన్న సినిమా చేయలేని అరుదైన ఫీట్ సాధిస్తుంది బేబీ.
రూ. 8 కోట్ల బ్రేక్ అనుకున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఈ సినిమాకు నిజంగా ఇంత సీన్ ఉందా అని.. కానీ రెండు రోజుల్లోనే ఆ కలెక్షన్స్ తీసుకొచ్చింది. బేబీ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉన్నా కూడా ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. ముఖ్యంగా యువత ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. 20 ఏళ్ల కింద 7/g బృందావన్ కాలనీ ఎలా అయితే అప్పటి యూత్‌కు కల్ట్ సినిమాగా మిగిలిపోయిందో.. ఈ జనరేషన్ యూత్‌కు బేబీ కూడా అలాగే కల్ట్ అయిపోయింది. కచ్చితంగా ఈ సినిమా సంచలనాలు మరో రెండు వారాల వరకు కొనసాగడం ఖాయం. బ్రో వచ్చేంతవరకు మరో సినిమా లేదు. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా బేబీ దూకుడు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఏదేమైనా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి సరైన విజయం కోసం చూస్తున్న ఆనంద్ దేవరకొండకు బేబీ సరైన బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అన్నకు అర్జున్ రెడ్డి.. తమ్ముడికి బేబీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి దీన్ని ఆనంద్ తన కెరీర్‌కు ఎంత వరకు యూస్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.
Read More :
Devara Movie | దేవరలో అల్లు అర్జున్ గారాల పట్టి.. రెండో సినిమాకే భారీ రెమ్యునరేషన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

