Ketika Sharma | పవన్ కళ్యాణ్ ఉన్నాడనే ఆ సినిమా ఒప్పుకున్నా : కేతికా శర్మ
Ketika Sharma | జయాపజయాలు మన చేతిలో ఉండవు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడాలి. ఫలితం గురించి ఆలోచించొద్దు’ అని చెప్పింది కేతికా శర్మ. ‘రొమాంటిక్' ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ ప్రస్తుతం ‘బ్రో’ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ సరసన నటిస్తున్నది.
Ketika Sharma | ‘జయాపజయాలు మన చేతిలో ఉండవు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడాలి. ఫలితం గురించి ఆలోచించొద్దు’ అని చెప్పింది కేతికా శర్మ. ‘రొమాంటిక్’ ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ ప్రస్తుతం ‘బ్రో’ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ సరసన నటిస్తున్నది. సముద్రఖని దర్శకుడు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం కేతికా శర్మ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘పవన్‌కల్యాణ్ నటిస్తున్న సినిమా ఇది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అంగీకరించా. పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో నాకు సీన్స్ లేవు కానీ..ఆయన సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నేను సాయిధరమ్‌తేజ్ ప్రేయసిగా కనిపిస్తాను. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది. చక్కటి సందేశంతో మెప్పిస్తుంది.
నటిగా మరింత పరిణితి సాధించడానికి ఈ పాత్ర దోహదపడింది. త్రివిక్రమ్ అద్భుతమైన సంభాషణలు ఈ సినిమాకు పెద్ద బలంగా నిలుస్తాయి. షూటింగ్ సందర్భంలో పవన్‌కల్యాణ్‌ను ఓసారి కలిశాను. ఆయనతో జరిపిన ఐదు నిమిషాల సంభాషణ ఎన్నో అనుభూతులను మిగిల్చింది. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. బయోపిక్ చిత్రంలో నటించాలన్నది నా డ్రీమ్. ప్రస్తుతం ఆహా స్టూడియోస్‌తో ఓ సినిమా చేస్తున్నా. ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

