Nidhhi Agerwal | ఓ అద్భుతాన్ని చూడబోతున్నారు.. నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ పోస్టు
Nidhhi Agerwal | హరిహర వీరమల్లు’ చిత్రంలో అగ్ర హీరో పవన్‌కల్యాణ్ సరసన నటిస్తున్నది బెంగళూరు సోయగం నిధి అగర్వాల్. తాజాగా ఈ సినిమాపై తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిందీ భామ.
Nidhhi Agerwal | ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో అగ్ర హీరో పవన్‌కల్యాణ్ సరసన నటిస్తున్నది బెంగళూరు సోయగం నిధి అగర్వాల్. తాజాగా ఈ సినిమాపై తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిందీ భామ. పవన్‌కల్యాణ్ తన అభిమాన నటుడని, ఆయనతో తెరను పంచుకోవడంతో తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.
చక్కటి కథాబలం ఉన్న గొప్ప చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రేక్షకులు తెరపై ఓ అద్భుతాన్ని చూడబోతున్నారని చెప్పుకొచ్చింది. ఇటీవల పవన్‌కల్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాను నటించిన కొన్ని సినిమాల క్లిప్సింగ్స్‌తో కూడిన వీడియోను షేర్ చేశారు. ఇందులో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్‌తో తీయించుకున్న ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో స్క్రీన్‌షాట్‌ను అభిమానులతో పంచుకుంది నిధి అగర్వాల్. ‘హరిహర వీరమల్లు’ తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

