Urvashi Rautela | బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి తన వ్యాఖ్యలతో ఆన్లైన్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమాతో నవ్వులపాలైన ఈ నటి, ఇప్పుడు నమ్మశక్యం కాని మరో వాదనను తెరపైకి తెచ్చింది. సన్నీ డియోల్, రణదీప్ హుడా నటించిన ‘జాట్’ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి, తాజాగా తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఒక గుడి ఉందని, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా తన పేరుతో ఒక గుడిని నిర్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.
ఉత్తరాఖండ్‌లో నా పేరుతో టెంపుల్ ఉంది. మీరు బద్రీనాథ్ టెంపుల్‌కి వెళ్లినప్పుడు, సరిగ్గా దాని పక్కనే అది మీకు కనిపిస్తుంది. ప్రజలు ఆ గుడిలో ప్రార్థనలు చేస్తారని, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు కూడా తనను ప్రార్థిస్తారని అలాగే తన ఫోటోలకు పూలమాలలు వేసి ‘దండమమాయి’ అని కోలుస్తారని ఊర్వశి చెప్పింది. నా కోరిక ఏమిటంటే.. గత ఒకటిన్నర సంవత్సరాల వ్యవధిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో కలిసి నటించాను. వారికి దక్షిణాదిలో గుళ్లు ఉన్నట్లే.. నా అభిమానుల కోసం కూడా దక్షిణ భారతంలో గుడి ఉండాలని నా కోరిక అని ఊర్వశి చెప్పుకోచ్చింది.