Uruku Patela Movie | ‘హుషారు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ యువ కథానాయకుడు తేజాస్ కంచర్ల. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉరుకు పటేలా’. గెట్ ఉరికిఫైడ్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాకు వివేక్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. కంచర్ల బాలభాను నిర్మిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను వదిలింది.
ఈ టీజర్ చూస్తే.. గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగ ప్రయాణమని తెలుస్తుంది. ఈ సినిమాలో ఖుష్బూ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఫన్నీగా సాగిన ఈ టీజర్ మీరు చూసేయండి. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, నిర్మాణం: లీడ్ ఎడ్జ్ పిక్చర్స్.
Also read..
Keerthy Suresh | చీరలో మనసు దోచేస్తున్న కీర్తి సురేష్..
Devineni Uma | ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూదందా.. వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డ దేవినేని