మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో అనూహ్యంగా టాలీవుడ్ లోకి దూసుకు వచ్చిన బుచ్చిబాబు అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వరలో ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడని సమాచారం. అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరో లేదా దర్శకుడి మొదటి సినిమాకు వంద కోట్ల వసూళ్లు వచ్చిన దాఖలాలు లేవు. కాని అది చేసి చూపించాడు బుచ్చిబాబు.
తాజాగా బుచ్చి బాబు దృష్టిలో ఉప్పెన 2 కథ ఉందట. ఈ విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు. ఉప్పెన సినిమా కథ కు కొనసాగింపుగా ఉండే ఉప్పెన 2 కథ కేవలం పాన్ ఇండియా కథ మాత్రమే కాదని.. అదో పాన్ వరల్డ్ కథ గా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. గ్లోబల్ కాన్సెప్ట్ అంటూ బుచ్చి బాబు ఉప్పెన 2 పై అంచనాలు భారీగా పెంచేశాడు. మరి సీక్వెల్లో కూడా వైష్ణవ్ ఉంటాడా, లేక మరో హీరో ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది.
గురువు లాగే మంచి జెన్యూన్.. జీనియస్ డైరెక్టర్ గా బుచ్చి బాబుకు పేరు ఉంది. ఆయనతో సినిమా చేసేందుకు పలువురు స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు. పెద్ద హీరోలు కూడా బుచ్చిబాబు కథలను వినేందుకు ఆసక్తి చూపుతున్నారట.