Upendra | నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా ఉపేంద్ర ఎంతటి ప్రతిభావంతుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తెరకెక్కించిన సినిమాలే అందకు నిదర్శనం. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యమే. ఆయన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్ కల్పితంలా కాకుండా నిజ జీవిత పాత్రలా అనిపిస్తుంటుంది. సమాజంలోని లోపాలను ఎత్తిచూపిస్తూ.. సెటైరికల్‌గా అదే సమయంలో ఎంటర్టైనింగ్ ఉండేలా ఆయన సినిమాలు రూపొందిస్తుంటాడు. ప్రముఖ సినిమా వెబ్సైట్ ‘ఐఎమ్‌డీబి’ టాప్-50 వరల్డ్ బెస్ట్ డైరెక్టర్లో ఉపేంద్రకు 17వ స్థానం ఇచ్చిందంటే.. ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే గతకొంత కాలంగా ఉపేంద్ర దర్శకత్వానికి దూరంగా ఉంటున్నాడు. ఆదే సమమంలో నటుడిగా తెగ బిజీ అయిపోయాడు. కాగా దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని ‘UI’ సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. న్యూఇయర్ సందర్భంగా రిలీజైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన డేట్‌ను సోమవారం ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది.
మనోహరన్- శ్రీకాంత్ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. కాంతర ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇక ఆ మధ్య ఈ సినిమా గురించి ఉప్పీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా కాలం తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా అదని, ఆ సినిమాలో తన టేస్ట్ స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చూస్తారని చెప్పాడు. అంతేకాకుండా ఆ సినిమా గనుక మీకు అర్ధమైతే మీరు సూపర్‌స్టార్ అవుతారు అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
🚀 Get ready for lift-off!#UiTheMovie‘s Update Of First Look is just 24 hours away, arriving at 10:00 am tomorrow#UppiDirects @nimmaupendra @LahariFilm #GManoharan @enterrtainers @kp_sreekanth #naveenmanoharan @AJANEESHB @shivakumarart @Reeshmananaiah @LahariMusic pic.twitter.com/m3HKwZGfxf
— BA Raju’s Team (@baraju_SuperHit) September 10, 2023