Upendra | రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో, అప్పట్లో సంచలనం సృష్టించిన ఉపేంద్ర మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన ‘ఉపేంద్ర’ సినిమా 1999లో విడుదలై కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు కొత్త తరానికి కూడా వినోదం పంచేందుకు సిద్ధమైంది. ‘ఉపేంద్ర’ మూవీ అక్టోబర్ 11, 2025న థియేటర్లలో గ్రాండ్ రీ రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ నెట్టింట్లో మంచి స్పందన అందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది.
“Get ready for a mad experience!” అంటూ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. ఈ మూవీని మరోసారి థియేటర్లలో చూడాలంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సినిమాలో ఉపేంద్ర హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. తనదైన విభిన్న కథన శైలితో ఈ సినిమాని తీర్చిదిద్దారు. చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు, కథ వివాదాస్పదం అయినప్పటికీ, సినిమా తీసిన అప్రోచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రేమ, దామిని కీలక పాత్రల్లో నటించారు. శిల్పా శ్రీనివాస్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతాన్ని గురుకిరణ్ అందించారు. అప్పట్లో పాటలు ట్రెండ్ సెట్ చేసాయి.
చిన్నప్పటి నుంచి నిజం మాట్లాడాలి అనుకొని పెరిగిన ఉపేంద్ర, ఈ నిబద్ధత వల్ల ఇబ్బందుల్లో పడతాడు. తన దారిలోనే జీవించే ఉపేంద్ర, ప్రేమ విషయంలోనూ అసాధారణంగా ప్రవర్తిస్తాడు. అతని నైజం, ప్రవర్తనకు కారణాలు ఏమిటి? చివరకు తన ప్రేమను సాధించాడా? అనేది సినిమాకే హైలైట్. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో మళ్లీ ప్రదర్శించాలనే ఉద్దేశం వెనుక ప్రధానంగా ఉపేంద్రపై అభిమానం, అలాగే కొత్త తరం ప్రేక్షకులకు ఈ సినిమాను చూపించాలనే ఆలోచన ఉంది. అప్పట్లో చిత్రం ‘అందరికీ అర్ధం కాలేదని, ఇప్పుడు మాత్రం ప్రేక్షకులకి పిచ్చెక్కిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Get Ready for a MAD EXPERIENCE in Cinemas. The Cult Classic #UPENDRA returns to theatres 🔥#UpendraReRelease Trailer Out Now- https://t.co/1bCAeNzVxy ❤️🔥
Grand Re-Release in Telugu on October 11th💥
NIZAM Release by @MythriRelease ✨@nimmaupendra #UpendraTrailer… pic.twitter.com/QmHk90RzT7— Mythri Movie Distributors LLP (@MythriRelease) October 8, 2025