వైవిధ్యమైన కథాంశాలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ హీరో ఉపేంద్ర. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘యూఐ’. జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మాతలు. పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయబోతున్నారు. బుధవారం ఉపేంద్ర జన్మదినం సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఉపేంద్ర కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిస్తున్న చిత్రమిదని, ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, నటుడిగా ఉపేంద్ర విశ్వరూపాన్ని చూస్తారని మేకర్స్ తెలిపారు. రీష్మా, నిధి సుబ్బయ్య, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతాన్నందిస్తున్నారు.