Upcoming OTT Movies | తండేల్, ఛావా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సందడి చేస్తున్నాయి. తండేల్ యదార్థ సంఘటనల ఆధారంగా రాగా.. ఛావా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే ఈ వారం ఏఏ సినిమాలు, థియేటర్‌కి రానున్నాయి ఏ సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి అనేది చూసుకుంటే.?
రామం రాఘవం
Ramam Raghavam
ఈ వారం తెలుగు నుంచి రెండు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి బ్రహ్మజీ నటిస్తున్నా బాపు అవ్వగా.. రెండోది రామం రాఘవం(Ramam Raghavam). తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని (Samutrakhani) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. జబర్తస్థ్ నటుడు ధనరాజ్ కీలక పాత్ర పోషిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రమిది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నాడు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
బాపు
Bapu Movie
తెలుగు నుంచి ఈ వారం వస్తున్న మరో చిత్రం బాపు (Bapu) ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ.. అనేది ఉపశీర్షిక.. సీనియర్ నటులు బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకు దయా దర్శకత్వం వహిస్తుండగా.. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న (Bapu Movie release date) ప్రేక్షకుల ముందుకు రానుంది.
డ్రాగన్
Dragon
ఈ వారం తెలుగు కంటే, తమిళ చిత్రాల హవా ఎక్కువగా ఉంది. ఈ వారం వస్తున్న సినిమాలలో ధనుష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంతో పాటు ప్రదీప్ రంగనాథన్ నటుడిగా వస్తున్న సినిమా రాబోతుంది. 2023లో లవ్ టూడే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా తొలి చిత్రంతోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్(). ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), ఖయదు లోహర్ (Kayadu Lohar) కథానాయికలుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న తమిళంతో పాటు తెలుగులో విడుదల కాబోతుంది.
జాబిలమ్మా నీకు అంత కోపమా
Jaabilamma Neeku Antha Kopam
దర్శకుడిగా ఇటీవల రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాబిలమ్మా నీకు అంత కోపమా(Jaabilamma Neeku Antha Kopama). మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్, అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా పవిష్, మాథ్యూ థామస్ కథానాయకులుగా నటిస్తున్నారు. వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్బేర్ బ్యానర్‌పై ఈ సినిమాను కస్తూరి రాజా, విజయలక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు – వెబ్ సిరీస్‌లు
ఆహా
మార్కో (తెలుగు వెర్షన్) ఫిబ్రవరి 21
నెట్‌ఫ్లిక్స్
డాకు మహారాజ్ (తెలుగు) ఫిబ్రవరి 21
జీరోడే (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 20
అమెజాన్ ప్రైమ్ వీడియో
రీచర్3 (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 20
జియో హాట్‌స్టార్
ది వైట్ లోటస్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 17
ఊప్స్ అబ్ క్యా (హిందీ సిరీస్) ఫిబ్రవరి 20
ఆఫీస్ (తమిళ సిరీస్) ఫిబ్రవరి 21
జీ5
క్రైమ్ బీట్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 21