Sikandar Movie | మరో వారం రోజుల్లో ఉగాది, రంజాన్ పండుగలు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం నుంచి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో తెలుగు నుంచే రాబిన్ హుడ్, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో పాటు మలయాళం నుంచి ఎల్ 2 ఎంపురాన్, బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ సికందర్, తమిళ డబ్బింగ్ చిత్రం వీర ధీర శురన్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఇవే కాకుండా పలు చిత్రాలు ఓటీటీలోకి కూడా రాబోతున్నాయి. అయితే ఈ వారం వచ్చే చిత్రాలను ఒకసారి చూసుకుంటే..
ఎల్ 2 ఎంపురాన్
L2 Empuraan
మలయాళ నటుడు మోహన్ లాల్ (Mohan Lal) దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్(L2 Empuraan). బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం పార్ట్ 2గా వస్తుంది. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీర ధీర శూరన్
Veera Dheera Sooran
పా. రంజిత్‌తో తంగలాన్ వంటి సూపర్ హిట్ అందుకున్న నటుడు చియన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇందులో భాగంగానే ఆయన నటిస్తున్న ఒక చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర ధీర శూరన్’(Veera Dheera Sooran). ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మిస్తుంది. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘మ్యాడ్ స్క్వేర్’
Mad Square
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది. మొదటి పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత నటులు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాబిన్‌హుడ్
Robinhood Movie
హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నటుడు నితిన్ (Nithiin). ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). ఈ సినిమాకు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సికందర్
Sikandar
బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సికందర్ (Sikandar). కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఈ చిత్రంలో సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా రంజాన్ కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఓటీటీలో సినిమాలు/ సిరీస్‌లు
జియో హాట్ స్టార్ :
ముఫాసా – ది లయన్ కింగ్ : మార్చి 26 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది.
నెట్ ఫ్లిక్స్ :
వీక్ హీరో క్లాస్ (కొరియన్) : మార్చి 24
కాట్(సిరీస్) : మార్చి 26
ది లైఫ్ లిస్ట్ : మార్చి 28
మలేనా(ఇటాలియన్) : మార్చి 29
మిలియన్ డాలర్ సీక్రెట్(రియాలిటీ షో) : మార్చి 26
ఆపిల్ టీవీ ప్లస్ :
సైడ్ క్వెస్ట్ (హాలీవుడ్) : మార్చి 26
ప్రైమ్ వీడియో :
మిక్కీ 17 (హాలీవుడ్) : మార్చి 25
హోల్యాండ్(హాలీవుడ్) : మార్చి 27
బాస్చ్ లెగసి – లాస్ట్ సీజన్(హాలీవుడ్) : మార్చి 27
వైట్ బర్డ్ (హాలీవుడ్) : మార్చి 30
జీ5
సెరుప్పగల్ జాకిరతై(తమిళ్) : మార్చి 28
విడుదలై పార్ట్ 2(హిందీ) : మార్చి 28
ఆహా :
ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ : మార్చి 26
ఆహా తమిళ్ :
మిస్టర్ హౌస్ కీపింగ్ (తమిళ్) : మార్చి 25