OTT | మరో రెండు రోజులలో మే మొదటి వారం మొదలు కాబోతుంది. ఈ వారంలో ప్రేక్షకులకి అసలు సిసలైన వినోదం పంచేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. సమ్మర్ సెలవులు మొదలు కావడంతో క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి కామెడీ ఎంటర్టైన్స్ వరకూ ఇటు థియేటర్స్‌లోకి అటు ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో కూడా మే 1న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు సంజయ్ దత్, సన్నీసింగ్, మౌనీరాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ కామెడీ ఫిల్మ్ ‘భూత్నీ మే 1న రిలీజ్‌కి రెడీ అయింది.
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రైడ్ 2’ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా పలు చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఓటీటీల్లోకి వచ్చే మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్ చూస్తే ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో బీయింగ్ మేరియా (ఇంగ్లీష్ – ఏప్రిల్ 29), డెత్ ఆఫ్ యూనికార్న్ (ఇంగ్లీష్ – ఏప్రిల్ 29), డ్రాప్ (ఇంగ్లీష్ – ఏప్రిల్ 29), ది ఫ్రెండ్ (ఇంగ్లీష్ – ఏప్రిల్ 29), సాక్రమెంటో (ఇంగ్లీష్ – ఏప్రిల్ 29), అనదర్ సింపుల్ ఫేవర్ (ఇంగ్లీష్ – మే 1), ఈఎంఐ (తమిళ్ మే 1)
నెట్ ఫ్లిక్స్ – మైగ్రేషన్ (ఇంగ్లీష్ ఏప్రిల్ 29), టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ – ఏప్రిల్ 30), ది ఇటర్నాట్ (అర్జెంటీనా సిరీస్ – ఏప్రిల్ 30), ఎక్స్టెర్రిటోరియల్ (జర్మన్ – ఏప్రిల్ 30), ఆస్ట్రిక్స్ అండ్ ఒబిలిక్స్ (కార్టూన్ సిరీస్ – ఏప్రిల్ 30), ది రోజ్ ఆఫ్ వర్సెల్లీస్ (ఏప్రిల్ 30), ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్ సిరీస్ – మే 1), వై ఐ డ్రెస్ అప్ ఫర్ లవ్ (జపనీస్ – మే 1), ది రాంగ్ వే టూ హీలింగ్ మ్యాజిక్ (జపనీస్ యానిమీ – మే1), యాంగీ: ఫేక్ లైఫ్ ట్రూ క్రైమ్ (ఇంగ్లీష్ మే 1), బ్యాడ్ బాయ్ (ఇంగ్లీష్ మే 2) చిత్రాలు స్ట్రీమ్ కానున్నాయి.
సోనీలివ్ లో బ్రొమాన్స్ (మే 1), బ్లాక్ వైట్ అండ్ గ్రే (హిందీ సిరీస్ – మే 1) నుండి స్ట్రీమ్ కానున్నాయి. జియో హాట్ స్టార్ లో చూస్తే.. కుల్ల్ (హిందీ వెబ్ సిరీస్ – మే 2), 100 ఫుట్ వేర్ (ఇంగ్లీష్ – మే 2), ది బ్రౌన్ హార్ట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ – మే 3), స్టార్ వార్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ – మే 4) నుండి స్ట్రీమ్ కానుంది. ఎంఎక్స్ ప్లేయర్ – ఈఎంఐ (తమిళ్ – మే 1), ఈటీవీ విన్ – ముత్తయ్య (మే 1), ఆహా తమిళ్ – వరుణన్ – మే 1, పీకాక్ ఓటీటీ – బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్ – మే 2), ఏఎంసీ + ఓటీటీ – ది వాకింగ్ డెడ్ (డెడ్ సిటీ సీజన్ 2 ఇంగ్లీష్ మే 4) నుండి స్ట్రీమ్ కానున్నాయి.ఈటీవీ విన్లో ముత్తయ్య మే 1 నుండి స్ట్రీమ్ కానుంది.