Upasana | మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మెగా కోడలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా , సోషల్ యాక్టివిటీ గా ఆమె సేవలు అందిస్తుంది ఉపాసన. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ మెగా కోడలు తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తూ ఉంటుంది.ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు పెళ్లయిన 11 ఏండ్లకు తల్లిదండ్రులు అయినా విషయం తెలిసిందే.
2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఆ చిన్నారికి క్లింకారా అనే పేరును పెట్టారు. ఇంతవరకు, రామ్ చరణ్ గారాలపట్టి క్లింకార ముఖాన్ని రివిల్ చేయలేదు. అయితే మెగా ఫ్యామిలీ మొత్తం.. క్లింకార వలన అదృష్టం కలిసి వచ్చింది అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మెగా అభిమానులు క్లింకార ఫేస్ రివిల్ చేయాలంటూ ఎన్నో రిక్వెస్ట్ లు పెట్టిన ఫలితం లేదు. ఫేస్ చూపించకుండా క్లింకారా ఫొటోస్ ను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ లలో క్యూరియాసిటీని పెంచుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే అప్పుడప్పుడు ఉపాసనకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉంటాయి. తాజాగా ఉపాసన ఓ ఈవెంట్లో లెఫ్ట్ హ్యాండ్‌తో రాస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్.. ఉపాసన లెఫ్ట్ హ్యాండ్‌తో భలే రాస్తుందిగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసనది మంచి హృదయమని, రామ్ చరణ్‌కి తగ్గ జోడి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు.చివరిగా గేమ్ ఛేంజర్ చిత్రం ఫ్లాప్ మూటగట్టుకున్న రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.