Upasana Konidela | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌పై ఉపాసన కొణిదెల రివేంజ్ తీర్చుకుంది. తనను అందరి ముందు ఎగతాళి చేసినందుకు బట్టలు ఉతికించడం, చెట్లకు నీళ్లు పోయడం, కాఫీ పెట్టించడం వంటి పనులు చేయించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. అలా అని రియల్‌గానే చెర్రీతో అన్ని పనులు చేయించిందని అనుకునేరు. అది నిజం కాదు.. కానీ ఉపాసనను అలా ఎగతాళి చేసినందుకు ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత ఎలా రివేంజ్ తీర్చుకుని ఉంటుందని ఓ నెటిజన్‌కు ఫన్నీ ఐడియా వచ్చింది. ఆ ఐడియాను వీడియో రూపంలోకి తీసుకొచ్చాడు. ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారడంతో ఉపాసన ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పోస్టు చేసింది. దీనికి ఫన్నీ ఎమోజీలను కూడా యాడ్ చేసింది.
నాలుగు నెలల కిందట అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ కూడా హాజరైంది. ఆ టైమ్‌లో రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్ ఒక సోఫాలో కూర్చొన్నారు. అప్పుడు సోఫా ఇరుకుగా ఉందని ఉపాసనను పక్కకు వెళ్లి కూర్చోమని చెర్రీ చెప్పాడు. అలా ఆమెను ఆట పట్టించినందుకు చెర్రీ, తేజూ ఇద్దరూ సరదాగా నవ్వుకున్నారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఉపాసన రివేంజ్ ఎలా ఉండి ఉంటుందనే ఆలోచనతో ఓ నెటిజన్ ఫన్నీగా వీడియో క్రియేట్ చేశాడు. అందులో లాక్డౌన్ సమయంలో చరణ్ చేసిన ఇంటి పనుల వీడియోను యాడ్ చేశాడు. ఈ వీడియోను చూసి నవ్వుకున్న ఉపాసన.. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ కింద పోస్టు చేసింది.