Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన బిజినెస్‌లతో, ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఉపాసన చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇక సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ సమాజానికి ఉపయోగపడే విషయాల గురించి అప్డేట్ చేస్తుంది. తాజాగా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన బిజినెస్, హెల్త్, ఫ్యామిలీ, వుమెన్ ఎంపవర్మెంట్ వంటి వాటి గురించి మాట్లాడింది. అదే క్రమంలో తన కూతురు క్లింకార గురించి కూడా కామెంట్స్ చేసింది.
ఉపాసన మాట్లాడుతూ.. నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే ఎక్కువగా పెరిగాను. నా కూతురు కూడా అలాగే పెరగాలి. తను గ్రాండ్ పేరెంట్స్ తో ఎక్కువ సమయం గడపాలి అని నేను భావిస్తుంటాను. గ్రాండ్ పేరెంట్స్‌తో గడపడం అందమైన అనుభవం.జాయింట్ ఫ్యామిలీ కల్చర్ తగ్గిన ఈ సమయంలో నా కూతురు జాయింట్ ఫ్యామిలీతో గడపడం ఎంతో ప్రత్యేకం. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటేనే ఇష్టం. నాకు అందరితో కలిసి ఉండాలి. మా అత్త మామ జాగ్రత్తగా చూసుకుంటారు. నేను వాళ్ళతో ఉండాలి అనుకుంటాను. మా ఫ్యామిలీ, మా మామయ్య ఫ్యామిలీ అంతా క్లిన్ కారాని జాగ్రత్తగా పెంచుతున్నారు అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఆయన గేమ్ ఛేంజర్ చిత్రంతో చివరిగా పలకరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుచ్చిబాబుతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కాగా, ఇది మూవీపై భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రం మంచి హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.