Pushpa Song | ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అల్లు అర్జున్ పుష్ప పాట..
Pushpa Movie Song Srivalli in UP Elections | జనాభా పరంగా చూసుకుంటే ఇండియాలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ప్రస్తుతం అక్కడ ఎలక్షన్స్ ఫీవర్ నడుస్తుంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతుండటంతో ప్రచారం జోరుగా జరుగుతోంది. బరిలో ఉన్న పార్టీలు ప్రజలను బుట్టలో వేసుకోవడానికి గుంప గుత్తగా వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి లీడింగ్ పార్టీ ప్రజలను ఆకట్టుకునేందుకు పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను ఉపయోగించుకుంది. ఈ పాట ట్యూన్‌కు తమ పార్టీ అజెండాను జత చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విషయాన్ని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరూ కలిసి చేసిన మ్యాజిక్ దేశం మొత్తాన్ని ఊపేస్తుంది.. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మార్మోగిపోతోంది.. ఇంతకంటే గొప్ప విజయం అనేది ఉండదు బ్రదర్.. అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. చూపే బంగారమాయే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే.. లైన్స్‌కు బదులు తూ హై గజబ్ యూపీ.. తేరీ కసమ్ యూపీ.. (నువ్వు ఒక అద్భుతం యూపీ.. నువ్వే సాక్షి యూపీ) అనే లైన్స్ జోడించారు. ప్రస్తుతం ఈ నినాదంతో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలకు వెళ్లింది ఒక పార్టీ. ఇది చూసి అల్లు అర్జున్ అభిమానులు గర్వంతో కలర్ ఎగరేస్తున్నారు. మరో వైపు తెలుగు సినీ అభిమానులు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు.
పుష్ప సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ విజయం అందుకుంది. ఇంకా చెప్పాలంటే అక్కడే పెద్ద విజయం సాధించింది ఈ సినిమా. దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా పాటలకు రీల్స్ చేస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఈ సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేడిలో కూడా పుష్ప హడావుడి కనిపిస్తోంది. ఒక తెలుగు సినిమాకు ఇంత కంటే గొప్ప విషయం మరొకటి ఏముంటుంది అంటున్నారు విశ్లేషకులు.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
శ్రీవల్లి హూక్ స్టెప్‌ను అచ్చు గుద్దినట్టు దింపేసిన బుడ్డోడు.. వీడియో వైరల్
అల్లు అర్జున్ సామీ సామీ సాంగ్ లుంగీ స్టెప్స్‌ను అచ్చుగుద్దినట్టు దింపేసిన యువతి.. వీడియో వైరల్
Pushpa | ‘శ్రీవల్లి’ స్టెప్ నేర్పిస్తున్న విండీస్ దిగ్గజం.. వీడియో వైరల్
శ్రీవల్లిలా ఉండండి.. పుష్పలా మాత్రం అస్సలు ఉండకండి.. ఎందుకో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

