ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప ఫీవరే. పుష్ప సినిమా పాటలే టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. కొందరు ఔత్సాహికులు అయితే పుష్ప పాటలకు డ్యాన్సులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.
ముఖ్యంగా శ్రీవల్లి పాటలోని హూక్ స్టెప్‌ను చాలామంది అనుకరించారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఓ బుడ్డోడు శ్రీవల్లి హూక్ స్టెప్ వేసి అదరగొట్టేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సరిగ్గా సంవత్సరం కూడా ఉండదు.. సరిగ్గా నడవడం కూడా రావట్లేదు కానీ.. హూక్ స్టెప్పును మాత్రం ఆ బుడ్డోడు దించేశాడు. వామ్మో.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. అదరగొట్టేశావుపో అంటూ నెటిజన్లు ఆ వీడియోపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
https://www.facebook.com/100001436091114/videos/1117893152317980/