ఎప్పుడా ఎన్నడా అంటూ బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్న నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం ప్రోమో విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ కొంచెం డోస్ పెంచి ఎంటర్టైన్ చేశాడు. మోహన్ బాబుతో సరదా వ్యాఖ్యలు, సీరియస్ మాటలు మాట్లాడుతూ షోపై ఆసక్తి పెంచాడు. ఇక మంచు లక్ష్మీతో దంచవే మేనత్త కూతురు పాటకు చిందులు కూడా వేశాడు.
బాలయ్య హోస్ట్‌గా నెవర్ బిఫోర్ అనేలా అన్‌స్టాపబుల్ షోని రూపొందించినట్టు తెలుస్తుంది. . సరదాలో స్టాప్ ఉండదు’.. ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అంటూ ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో తో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నామని ప్రోమోతో హింట్ ఇచ్చారు. తాజాగా వదిలిన ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మోహన్ బాబుతో పాటు ఆయన కుమార్తె మంచు లక్ష్మీ, పెద్ద కుమారుడు, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. నవంబర్ 4నుండి తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి.