Unni Mukundan | ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఇక గతేడాది చివర్లో ఉన్ని నటించిన మాలికాపురం (Malikapuram) అనే చిత్రం చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది. 5 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డు సాధించింది. ఇదిలా ఉంటే ఉన్ని ముకుందన్ నటిస్తున్న తాజా చిత్రం మార్కో (Marco). మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్లో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ”మీరు అతని విలనిజం చూశారు! ఇప్పుడు అతని హీరోయిజం చూస్తారు” అంటూ మోషన్ పోస్టర్‌కు మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ మోషన్ పోస్టర్లో ఉన్ని ముకుందన్ సిగార్ (CIGAR) పట్టుకుని యాక్షన్ మోడ్‌లో ఉన్న లుక్ మనం చూడవచ్చు. 2024లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండగా.. ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం.
You saw his Villainism ! Now witness the Heroics!! 🗡️
Hello, #Marco ! A high budget action violent entertainer 🤝
First Look Motion Poster: https://t.co/kVg6yOCEXb#MarcoTheFilm @iamunnimukundan @haneef_adeni #ShereefMuhammed #AbdulGadhaf #CubesEntertainments @trendytollyPR… pic.twitter.com/7CeZEUXViU
— Ramesh Bala (@rameshlaus) October 2, 2023