బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ (Kisi ka Bhai Kisi Ki Jaan). ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. వెంకటేశ్, జగపతి బాబు, భాగ్యశ్రీ, భూమికా చావ్లా, మాళవికా శర్మ కీలక పాత్రలు పోషించారు. రామ్ చరణ్ ఓ పాటలో అతిథిగా మెరిశాడు.
ఈద్ సీజన్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలి రోజు వసూళ్లు నిరాశపర్చాయి. ట్రేడ్ సర్కిల్ టాక్ ప్రకారం దేశవ్యాప్తంగా తొలి రోజు నెట్ కలెక్షన్ 15 కోట్ల రూపాయలుగా నమోదైంది. సల్మాన్ గత చిత్రాల తొలి రోజు వసూళ్లతో చూస్తే ఇది తక్కువే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల విషయంలో ఊహించని గ్రోత్ కనిపించింది.
రెండో రోజు రూ.25.75 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ సర్కిల్ సమాచారం. అంటే తొలి రోజుతో పోలిస్తే 60 శాతం గ్రోత్ ఉందన్నమాట. ఈ లెక్కన రెండో రోజుల కలెక్షన్లు రూ.41.5 కోట్లకు చేరింది. కొత్తదనం కంటెంట్ ఉన్నప్పటికీ, సల్మాన్ ఖాన్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలెక్షన్లు పెరిగేందుకు ప్రధాన కారణమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక నేడు ఆదివారం కాబట్టి వసూళ్ల పరంగా మెరుగైన ఫలితాలే ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి మూడో రోజు నాటికి వసూళ్లు ఎంత మేర పెరుగుతాయేది చూడాలంటున్నారు సినీ జనాలు.
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ టీజర్