Project-K Movie | రోజు రోజుకు ప్రాజెక్ట్-కే సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో నాగ్అశ్విన్ సీన్స్‌ను డిజైన్ చేశాడట. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో వస్తున్నారు. ఇప్పటివరకు మేజర్ పోస్టర్లు రిలీజ్ కాకపోయిన.. ఈ సినిమాపై తిరుగులేని హైప్ ఉంది. ఇక ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దీశా పటాని వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉండగా.. తాజాగా మరో స్టార్ యాడ్ అయ్యాడు.
విశ్వనటుడు కమల్ ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం వచ్చినా.. కమల్ ఏంటీ? విలన్‌గా చేయడం ఏంటీ? ఇదంతా పుకారే అంటూ నెటిజన్లు కొట్టిపారేసారు. తాజాగా చిత్రబృందం పుకారునే నిజం చేస్తూ కమల్ ఈ సినిమాలో భాగం అయినట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమాలో కమల్ ప్రతినాయకుడి పాత్రలో మెరవనున్నాడట. అంతేకాకుండా దీనికోసం కమల్ అక్షరాల వంద కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఆగస్టులో మొదలయ్యే భారీ షెడ్యూల్లో కమల్ పాల్గొనున్నాడట. నెల రోజుల పాటు నిర్విరామంగా కమల్‌తో సీన్స్ చిత్రీకరిస్తారట. కేవలం నెల రోజులకే వంద కోట్లు తీసుకుంటున్నాడంటే కమల్ రేంజ్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది.
ఇందులో నిర్మాతలకు కూడా కలిసొచ్చే అంశమే. ఎందుకుంటే బాహుబలి తర్వాత ఆహా ఓహో అనే రేంజ్లో తెలుగు సినిమాలు కోట్లు కొల్లగొట్టినవి చాలా తక్కువే. గతేడాది వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం సెకండ్ ప్లేస్లోనే ఆగిపోయింది. ఇక ప్రాజెక్ట్-Kకు కమల్ కూడా తోడవడంతో తమిళ్లో మళ్లీ ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
Welcoming the greatest actor Ulaganayagan @ikamalhaasan. Our journey becomes Universal now. #ProjectK https://t.co/DIbI5R7YA2#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/pokTfuErl0
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 25, 2023