‘ఉద్వేగం’ చిత్రం కోర్ట్‌రూమ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఇప్పటివరకు చర్చించని సరికొత్త పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పారు దర్శకుడు మహిపాల్ రెడ్డి. త్రిగుణ్ హీరోగా నటించిన ‘ఉద్వేగం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి గురువారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ‘ఇదొక కోర్ట్‌రూమ్ డ్రామా. గ్యాంగ్‌రేప్ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడి తరపున లాయర్ అయిన హీరో వాదిస్తుంటాడు. అమ్మాయి తరపున మరో లాయర్ కేసును టేకాఫ్ చేస్తాడు. కేసును వాదించే క్రమంలో ఇద్దరు లాయర్ల మధ్య సంఘర్షణ ఆసక్తిని కలిగిస్తుంది. చివరకు ఇద్దరూ కేసులో గెలవడమే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్. అదేమిటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’ అని చెప్పారు.