కరుణానిధి మనవడుగా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు ఉదయనిధి స్టాలిన్. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, హీరోగా తమిళ ప్రజలకు దగ్గరయ్యాడు. ఈయన సినిమాలకు తమిళనాట మంచి క్రేజ్ ఉంటుంది. అయితే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి బరిలోకి దిగాడు. డీఎంకే పార్టీ యూత్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తండ్రి స్టాలిన్ సీఎంగా, కొడుకు ఎంఎల్ఏగా గెలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తండ్రి స్టాలిన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలవకపోయినా కొడుకు మాత్రం ఎంట్రీతో విక్టరీని సొంతం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఉదయనిధి పుదుచ్చేరిలో జరుగుతున్న తన రాజా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ శుక్రవారం పుదుచ్చేరిలో మొదలైంది. ఉదయనిధికి జంటగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. కలైయరసన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్బాస్ రియాల్టీ షో ప్రేమ్ ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు.