Two much with Kajol and Twinkle Khanna | బాలీవుడ్ అగ్ర తారలు కాజోల్, ట్వింకిల్ ఖన్నా ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరూ కలిసి ప్రైమ్ వీడియోలో ఒక కొత్త టాక్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించబోతున్నారు. టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్(Two much with Kajol and Twinkle Khanna) పేరుతో రానున్న ఈ టాక్ షో… కాఫీ విత్ కరణ్, బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో లాగానే భారతదేశంలోని ప్రముఖ సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయనుంది. ఈ షోని సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు నిర్వహాకులు. ఈ సందర్భంగా ఈ షో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ముఖ్య అతిథులుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పాటు ఆమిర్ ఖాన్, జాన్వీ కపూర్, విక్కీ కౌశల్, గోవిందా, కరణ్ జోహార్, కృతి సనన్, ఆలియా భట్ తదితరులు వచ్చి సందడి చేశారు.