‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ స్థాయి ఆకాశమంత ఎత్తుకు చేరుకుంది. ఆయన సినిమా బడ్జెట్ కూడా వందలకోట్లకు చేరింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ నటించనున్న సినిమాకు బడ్జెట్ 600కోట్ల పై మాటేనట. సైన్స్ ఫిక్షన్ నేపథ్య కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేయనున్నారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ గ్రాఫిక్స్ కంపెనీలు ఈ సినిమాకోసం పనిచేస్తున్నాయి. కథ ప్రకారం బన్నీ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అదే నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు కన్నుల పండుగే. ఇదిలావుంటే ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలకు స్థానం ఉన్నదట. ఇప్పటికే ఓ కథానాయికగా జాన్వీకపూర్ పేరు బలంగా వినిపిస్తున్నది. మరో కథానాయికగా మృణాల్ ఠాకూర్‌ని తీసుకున్నారని వినికిడి. మృణాల్ కూడా ఈ విషయాన్ని చూచాయగా ఇటీవల ధృవీకరించింది. ఇప్పుడు మూడో హీరోయిన్గా అనన్య పాండే పేరు వినిపిస్తుంది. నిజంగా ఈ ముగ్గురూ కథానాయికలైతే.. సినిమా కలర్ఫుల్గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ పానిండియా సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.