Devi Sri Prasad | ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోని అన్ని సినిమాలు, మ్యూజిక్, ఆర్ట్ అంతా కూడా అందరికి అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో సినిమాల కథలు, సాంగ్స్, మ్యూజిక్ ఈజీగా కాపీ జరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకి సంబంధించిన కథ, మ్యూజిక్ కాపీ చేస్తున్నారంటూ దక్షిణాది, ఉత్తరాది టెక్నీషియన్స్‌పై అప్పట్లో విమర్శలు వచ్చేవి. అయితే ఇప్పడు దేవి శ్రీ సంగీత సారథ్యంలో రూపొందిన ఊ అంటావా సాంగ్‌ని విదేశీయులు కాపీ కొట్టారంటూ దేవి శ్రీనే స్వయంగా పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నేను 5 నిమిషాల్లో చెన్నైలో క్రియేట్ చేసిన ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ సాంగ్ ని ఎవరో కాపీ కొట్టారు. వాళ్ల మీద కేస్ వేయాలా, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అన్నారు.
అయితే మన తెలుగు సాంగ్ ని కాపీ కొట్టినందుకు గర్వంగా కూడా ఉంది అని అన్నారు. అయితే ఈ సాంగ్ ఎవరు కాపీ కొట్టారా అని అప్పటి నుండి నెటిజన్స్ తెగ వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం టర్కిష్ సింగర్ మన పాటని కాపీ కొట్టినట్టు తేలింది. టర్కిష్ సింగర్ అతియే ఊ అంటావా సాంగ్ మ్యూజిక్ ని కాపీ కొడుతూ ‘అన్లయినా..’ అంటూ టర్కిష్ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్ ని చేయగా, ఈ సాంగ్ అచ్చం మన సాంగ్ మాదిరిగానే ఉంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాపీ కొడితే కొట్టావు కనీసం క్రెడిట్స్ అయిన ఇవ్వాలి కదా అని అంటున్నారు. ప్రస్తుతం రెండు పాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ద రైజ్’కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఇందులో ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్‌కి సమంతతో స్టెప్పులు వేయించారు. ఈ పాట ఫుల్ ఫేమస్ అయింది. క్రికెటర్స్ కూడా ఈ పాటలకి స్టెప్పులు వేసి అలరించారు. అయితే ఈ పాటని తమిళ హీరో సూర్య నటించిన ‘వీడోక్కడే’ సినిమాలో ‘హానీ హానీ…’ అని ఓ స్పెషల్ సాంగ్ నుండి దేవి శ్రీ ప్రసాద్ కాపీ చేశాడని అప్పట్లో నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. ఆ పాట, ఈ పాట సేమ్ ఉన్నాయని అన్నారు. కాని దీనిపై పుష్ప చిత్ర బృందం కాని, దేవి కాని స్పందించలేదు.
They copied Oo Antava Mama from Pushpa film and thought no one would notice. Unfortunately copyright law doesn’t apply to tones and chords. pic.twitter.com/c2cbAPQcBa
— Lord Immy Kant (@KantInEastt) July 15, 2025