Tu Meri Main Tera | బాలీవుడ్ యువ నటీనటులు కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ (Tu Meri Main Tera Main Tera Tu Meri). ఈ సినిమాకు సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తుండగా.. ‘సత్యప్రేమ్ కి కథ’ (Satyaprem Ki Katha) చిత్రం తర్వాత కార్తీక్ – సమీర్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions), నమః పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ టీజర్ చూస్తుంటే.. కార్తీక్, అనన్యలు అనుకోకుండా ఒక విదేశీ హాలిడే ట్రిప్‌లో కలుసుకోగా.. గొడవలతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా ఎలా మారింది అనేది సినిమా కథ అని తెలుస్తుంది. ‘పతి పత్ని ఔర్ వోహ్’ (Pati Patni Aur Woh) తర్వాత కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే కలిసి నటిస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.