Selena Gomez | అక్రమ వలసదారులను తమ దేశం నుంచి సాగనంపుతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తనను బాధపెట్టిందంటూ హలీవుడ్ నటి సెలీనా గోమెజ్ అవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఒక వీడియోను పోస్ట్ చేసిన ఆమె కాసేపటికే ఆ వీడియోను డీలిట్ చేసింది.
అక్రమ వలసదారులు అమెరికాలోకి రాకుండా.. చట్టం చేస్తామంటున్న ట్రంప్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నన్ను క్షమించండి. ”నా ప్రజలు గాయపడుతున్నారు. నేను సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ నాకు ఎలా చేయాలో తెలియదు. నేను నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హమీ ఇస్తున్నాను అంటూ చెప్పుకోచ్చింది. అయితే ఈ వీడియోపై కొంతమంది ట్రోల్ చేయగా మరికొంతమంది ఆమెకు మద్దతుగా నిలిచారు. కాగా డీలీట్ చేసిన వీడియోను మీరు కూడా చూసేయండి.
Selena Gomez bursts into tears over Donald Trump’s immigration law against Mexicans and Latinos in the US. pic.twitter.com/BuPidfBqFa
— Selena Gomez News (@SELENAT0RSARMY) January 27, 2025