Nawazuddin Siddiqui | చిన్న పట్టణాల్లోనే అసలైన రొమాన్స్ ఉంటుంది.. పెద్ద నగరాల్లో రాజీలు, సర్దుబాట్లే: నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ
Nawazuddin Siddiqui | బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చిన్న పట్టణాల్లో, పెద్ద నగరాల్లో ప్రేమాయణం (Romance) గురించి మాట్లాడారు. భార్య ఆలియా సిద్దిఖీతో గొడవలతో విసిగిపోయిన ఆయన తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముంబై: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చిన్న పట్టణాల్లో, పెద్ద నగరాల్లో ప్రేమాయణం (Romance) గురించి మాట్లాడారు. భార్య ఆలియా సిద్దిఖీతో గొడవలతో విసిగిపోయిన ఆయన తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న పట్టణాల్లోనే అసలైన ప్రేమ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే చిన్న పట్టణాల్లో కలిసి బతికేవాళ్లలో ఒకరిపై ఒకరికి గుండెల నిండా ప్రేమ ఉంటుందని, వారి ప్రేమ అవతలి వ్యక్తి బ్యాంక్ బ్యాలెన్స్‌ను పరిగణలోకి తీసుకోదని, హృదయంతోనే ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు.
పెద్ద నగరాల్లో ఒకరికొకరు రాజీపడి, సర్దుబాటు చేసుకుని బతుకుతూ అదే ప్రేమ (రొమాన్స్) అని భ్రమపడుతున్నారని నవాజుద్దీన్ చెప్పారు. చిన్న పట్టణాల్లో ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఏమాత్రం భయపడరని, అందుకే చిన్నచిన్న పట్టణాల్లో ప్రేమ ఇంకా బతికే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నీకు నువ్వు రొమాంటిక్ పర్సన్ అనుకుంటున్నావా అని మీడియా ప్రశ్నించగా.. ‘ప్రేమించడం, ప్రేమలో పడటం, ప్రేమలో ఉండటం, ప్రేమ పంచడం అనేవి మంచి లక్షణాలు. ప్రేమ చాలా ముఖ్యమైనది. నేను చాలా రోమాంటిక్ వ్యక్తిని. నేను నా సినిమాలతో జీవితంలో చాలా వాటిని ప్రేమిస్తున్నా. మన జీవితాల్లో కొంతైనా ప్రేమ పొందడం ముఖ్యం. కానీ ఈ రోజుల్లో ఆ ప్రేమ కరువైంది’ అని నవాజుద్దీన్ సమాధానమిచ్చారు.
కాగా, నవాజుద్దీన్ వ్యక్తిగత జీవితంవల్ల ఈ మధ్య ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నవాజుద్దీన్ తల్లి తనను వేధిస్తున్నదని ఆయన భార్య ఆలియా ఆరోపిస్తున్నది. అదేవిధంగా నవాజుద్దీన్ తమ పిల్లలు షోరా, యానిలను కూడా సరిగా పట్టించుకోవడం లేదని ఆలియా ఆరోపణలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రేమ గురించి ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

