AA22 | సాధారణంగా కొన్ని మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్లు ఉంటాయి. అలాంటి కాంబినేషన్లలో సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటి మోస్ట్ అవెయిటెడ్ కాంబోల్లో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram srinivas)-అల్లు అర్జున్. ఈ ఇద్దరి కలయికలో జులాయి, సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. బన్నీ త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా రాబోతుందని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అల్లు అర్జున్ (Allu Arjun)22వ సినిమాAA22 ప్రాజెక్టుగా రాబోతున్న ఈ మూవీ ప్రకటన రేపు ఉండబోతుందని తాజా సమాచారం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 22గా వస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న గుంటూరు కారం మాస్ స్ట్రైక్‌ను ఇటీవలే విడుదల చేయగా.. నెట్టింట వ్యూస్ పంట పండిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్‌లో నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ అవుతున్నట్టు కూడా తెలియజేసి మూవీ లవర్స్‌లో జోష్ నింపింది.
త్రివిక్రమ్-బన్నీ కలయికలో వచ్చిన జులాయి చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా.. సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మరి ఈ సారి రాబోతున్న సినిమా ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందోనని అప్పుడే లెక్కలేసుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.
The iconic combo of #AlluArjun & #Trivikram reunites tomorrow on the auspicious occasion of “Devshayani Ekadashi.” 😍🔥🤩 After their phenomenal success with #Julayi, #SonofSatyamurthy & #AlaVaikunthapurramuloo, they are joining forces once more for a high profile family… pic.twitter.com/y0rhF0YbJi
— KARTHIK DP (@dp_karthik) June 28, 2023