Trivikram-Ntr Movie | టాలీవుడ్‌లోని అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే హీరో ఎవరా అని ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మహేష్‌తో సినిమా చేస్తున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కలయికలో తెరకెక్కుతున్న హ్యట్రిక్ సినిమా కావడంతో ప్రేక్షకులలో ఓ రేంజ్ అంచనాలున్నాయి. కాగా త్రివిక్రమ్, మహేష్‌తో కంటే ముందు తారక్‌తో ఓ సినిమా చేయాల్సిఉంది. కానీ పలు కారణాల వలన అది పక్కకు జరిగింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ను నిర్మాత సూర్యవంశీ ప్రేక్షకులతో పంచుకున్నాడు.
త్రివిక్రమ్ లైనప్‌లో తారక్ ఉన్నాడని, కానీ ఈ సారి కొత్త కథతో సినిమా రూపొందుతుందని సూర్యవంశీ చెప్పాడు. అంతేకాకుండా ఈ సారి త్రివిక్రమ్, తారక్‌తో ఓ పౌరాణిక సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా తెరకెక్కనుందని తెలిపాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ చెరో రెండు కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అప్పటివరకు క్లాస్ డైరెక్టర్‌గా పేరున్న త్రివిక్రమ్.. ఈ సినిమాలో తనలోని మాస్ యాంగిల్‌ను బయటకు తీశాడు. సినిమాలోని మొదటి 20 నిమిషాలతోనే త్రివిక్రమ్ మాస్ సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉంటుందోనని చూపించాడు.