Trisha Krishnan | టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీల్లో ఒకటైన విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మువీ నుంచి విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. అయితే ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు త్రిష పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. త్రిష ఇందులో అవని అనే పాత్రలో కనిపించబోతుంది. చీరకట్టులో ఆమె మెరిసిపోతూ కనిపించారు.
‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, ఈ సినిమా విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ సింగిల్ విడుదలతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకోగా, రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Team #Vishwambhara wishes the eternal beauty @trishtrashers a very Happy Birthday ❤🔥
She brings life to ‘AVANI’ with her charm and brilliance.
You will witness it soon.MEGA MASS BEYOND UNIVERSE in Cinemas Soon.
MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta… pic.twitter.com/0v25bDOsP5
— UV Creations (@UV_Creations) May 4, 2025