Trisha Krishnan | సోషల్ మీడియా వేదికగా విషపూరితమైన పోస్టులు పెట్టేవారిపై తమిళ నటి త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్గా నటించింది త్రిష. అయితే ఈ సినిమా విషయంలో త్రిష వ్యక్తిగత జీవితాన్ని లాగి కొందరూ ఆకతాయిలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది త్రిష.
సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ”విషపూరితమైన వ్యక్తులారా, అసలు మీ జీవితం ఎలా ఉంటుంది మీ జీవితంలో బాగా నిద్రపోతారా? సోషల్ మీడియాలో కూర్చొని ఇతరుల గురించి అర్థంలేని విషయాలు పోస్ట్ చేయడం నిజంగా మీకు సంతోషంగా అనిపిస్తుందా. ఇతరుల గురించి నీచమైన పోస్టులు పెట్టే మీతో పక్కనున్న వారికి చాలా ప్రమాదం. గుర్తుతెలియని ఈ పిరికిపందలను చూస్తుంటే బాధగా ఉంది. వీరిని దేవుడే రక్షించాలంటూ.” త్రిష రాసుకోచ్చింది.