చెన్నై చంద్రం త్రిష పెళ్లి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ నానుతుంది.పెళ్లి అంటూ ప్రచారం చేయడం, అంతలోనే కాదని చెప్పడం కామన్‌గా మారింది. అప్పుడెప్పుడో ప్రభాస్ తో వర్షం సినిమాతో పాపులర్ అయిన త్రిష అప్పటి నుంచి ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. నిశ్చితార్థం జరిగినా పలు కారణాల వలన దానిని క్యాన్సిల్ చేసుకుంది. అందుకు గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు.
సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన పాపులర్ సీనియర్ హీరోయిన్స్‌లో త్రిష ఒకరు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో హీరోయిన్ గా నటించింది. 20 ఏళ్ల సుధీర్ఘ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసింది. కెరీర్ మొదట్లో హిట్ సినిమాలు త్రిషకి దక్కగా, ఇప్పుడు ఏదో నామమాత్రంగా నడుస్తున్నాయి.
వరుణ్ మణియన్ అనే నిర్మాతతో నిశ్చిత్తార్థం క్యాన్సిల్ అయిన తర్వాత త్రిష పెళ్లికి సంబంధించి చాలా పుకార్లు వచ్చాయి. తాజాగా కోలీవుడ్ లో త్రిష పెళ్లి వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఒక వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి నిశ్చయం అయ్యిందని.. అందుకే త్రిష కొత్తగా సినిమాలేవీ అంగీకరించడం లేదని.. త్వరలోనే తన పెళ్లి గురించి త్రిష ప్రకటన చేయనుందని అంటున్నారు.మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ , బాలక్రిష్ణ మూవీలో నటిస్తోంది.