Trisha | తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ రెండు దశాబ్దాలకుపైగా మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది చెన్నై చంద్రం త్రిష (Trisha). ఇటీవలే మణిరత్నం భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2లో మెరిసింది. నాలుగు పదుల వయస్సులోనూ వన్నె తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది. త్రిష ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ భామ నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి విజయ్ (Vijay) తో కలిసి నటిస్తున్న లియో (Leo.. Bloody Sweet).
దీంతోపాటు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తోన్న రామ్.. పార్టు 1 ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తమిళంలో ది రోడ్, సథురంగ వెట్టై 2 చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కమల్ హాసన్ 234 (KH 234). మొదటిసారి మణిరత్నం, తన కాంబోలో వచ్చిన నాయకన్ లాంటి పర్ఫెక్ట్ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇటీవలే ఓ చిట్‌చాట్‌లో చెప్పాడు కమల్ హాసన్. ఇక ఈ క్రేజీ సినిమాలో కూడా దాదాపు త్రిషనే హీరోయిన్గా ఫైనల్ అయింది. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అజిత్‌కుమార్ (Ajithkumar), మగిజ్ తిరుమేని కాంబోలో వస్తున్న VidaaMuyarchiలో త్రిషను ఫైనల్ చేశారని సమాచారం. మరోవైపు ధనుష్ 50గా రానున్న ప్రాజెక్టులో కూడా త్రిషనే తీసుకోబోతున్నాడన్న టాక్ జోరుగా నడుస్తోంది. ఈ లెక్కన ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే నాలుగు పదుల వయస్సులోనూ లీడింగ్ హీరోయిన్గా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న భామ త్రిష ఒక్కరే అని స్పష్టమవుతోంది.