Trisha Krishnan | ఈ ఏడాది మణిరత్నం భారీ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 2తో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది చెన్నై భామ త్రిషా కృష్ణన్ (Trisha Krishnan). ఓ వైపు గ్లామరస్ పాత్రల్లో అందాలు ఆరబోస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ లీడింగ్ సినిమాల్లో నటిస్తూ కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనే ఇస్తుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న లియో (Leo)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే మరో సినిమాకు కూడా సంతకం చేసింది.
త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాజా మలయాళ సినిమా Identity. టోవినో థామస్ (Tovino Thomas) హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అఖిల్ పాల్, అనస్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా టాక్ ప్రకారం త్రిష సెప్టెంబర్‌లో ఈ మూవీ సెట్స్‌లో జాయిన్ కానుంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం 45 రోజులు డేట్స్ ఇచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుండట.. త్రిష ఈ యాక్షన్ పార్టులో భాగం కానుందని ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించి త్రిష టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే మరోవైపు కల్యాణ్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాలో ఫీ మేల్ లీడ్ కోసం త్రిష పేరును పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే స్టాలిన్ తర్వాత త్రిష-చిరంజీవి కాంబోలో రాబోతున్న రెండో సినిమా కానుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైనర్పై సుస్మిత కొణిదెల నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Totally pumped to associate with this squad in a high octane action entertainer🤩🙏🏻@ttovino #akhilpaul #anaskhan #identity pic.twitter.com/4qb8Qbksbh
— Trish (@trishtrashers) July 8, 2023