తమిళ సోయగం త్రిష సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నది. ముఖ్యంగా ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ చిత్రాలతో ఈ భామ దశ తిరిగింది. అక్కడి నుంచి వరుసగా అన్నీ విజయాలే వరిస్తున్నాయి. ఆమె కమల్‌హాసన్ సరసన కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్‌లైఫ్’ జూన్ 5న విడుదలకు సిద్ధమవుతున్నది. అగ్ర దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలేర్పడ్డాయి. బుధవారం ఈ సినిమా నుంచి ‘షుగర్ బేబీ’ అనే పాటను విడుదల చేశారు. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ఈ పాటను అనంతశ్రీరామ్ రచించారు.
‘ఏం కావాలి నీకు, కొద్దికొద్దిగడుగు, ఇంకేం కావాలి నీకు, స్వర్గం తేనా ఇలకు, కల్లబొల్లి గుండె కన్నుమీటుతుందే..షుగర్ బేబీ’ అంటూ సాఫ్ట్ అండ్ మెలోడీ బీట్తో ఈ పాట సాగింది. త్రిష తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో కమల్‌హాసన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో శ్రేష్ట్‌మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.