Trisha Krishnan Donates Mechanical Elephant | తమిళ నటి త్రిష కృష్ణన్ తమిళనాడులోని అరప్పుకోట్టైలో ఉన్న శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినయగర్ మరియు శ్రీ అష్టభుజ ఆదిశేష వరాహి అమ్మన్ ఆలయాలకు ‘గజ’ అనే పేరు గల యాంత్రిక ఏనుగును (మెకానికల్ ఎలిఫెంట్) బహూకరించారు. పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియా (PFCI) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె ఈ విరాళం అందించారు. ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూనే, నిజమైన ఏనుగులకు ఎలాంటి హాని కలగకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ యాంత్రిక ఏనుగును బహూకరించింది త్రిష. ఈ యాంత్రిక ఏనుగు సుమారు 3 మీటర్ల పొడవు, 800 కిలోల బరువుతో నిజమైన ఏనుగులాగే ఉంటుంది. ఇది చక్రాలపై నడుస్తుంది, భక్తులపై నీరు చల్లుతుంది, తల, చెవులు కదపగలదు. రూ.6 లక్షలతో తయారైన ఈ ఏనుగును ఆలయ వేడుకల సమయంలో ఉపయోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
விருதுநகர்: அருப்புக்கோட்டையில் உள்ள அஷ்டலிங்க ஆதிசேஷ செல்வ விநாயகர் கோயிலுக்கு இயந்திர யானையை வழங்கிய நடிகை த்ரிஷா#Elephant | #Trisha | #Virudhunagar pic.twitter.com/HW0w0DYJlE
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) June 28, 2025