HomeCinemaTrisha Krishnan And Simbu Planning To Get Married Soon News Viral In Social Media
Trisha Krishnan | పెళ్లిపై నమ్మకం లేదన్న త్రిష.. నిజంగానే ఆ హీరోను మనువాడబోతుందా..?
Trisha Krishnan | ప్రముఖ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు దాటింది.
2/22
ఓ వైపు వయసు పెరుగుతున్నా.. తరగని అందంతో దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నది.
3/22
నలబై రెండు సంవత్సరాలు వచ్చినా ఈ బ్యూటీ ఇంకా పెళ్లి మాటత్తడం లేదు. గతంలో ఒకసారి ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే.
4/22
ఆ తర్వాత పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చినా అందులో ఏవీ నిజం కాలేదు.
5/22
గతంలో తమిళ సూపర్‌స్టార్ విజయ్‌తో పీకలోతు ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకోనుందనే వార్తలు వచ్చాయి.
6/22
తాజాగా మరో నటుడుతో ప్రేమలో ఉందని.. ఇద్దరూ వివాహంతో ఒకటి కానున్నారనే ప్రచారం సాగుతుంది. ఆ హీరోకు సైతం పెళ్లికాకపోవడం గమనార్హం.
7/22
ఆ హీరో ఎవరో కాదు శింబు. ఇటీవల శింబు-త్రిష సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
8/22
ఇందులో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ కనిపించగా.. ఆ ఫొటో చూసిన వారంతా వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారి చెప్పుకొస్తున్నారు.
9/22
ఈ ఫొటో ఎక్కడిది.. ఎప్పుడు తీశారనే విషయం క్లారిటీ లేదు. శింబు-త్రిష ఇద్దరు మంచి స్నేహితులని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నారు.
10/22
వీరిద్దరి కాంబినేషన్లో అలై, విన్నతాండి వారువాయా తదితర సినిమాల్లో నటించారు.
11/22
లాక్డౌన్లో దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన ‘కార్తీక్ డయల్ సైత ఎన్’ షార్ట్‌ఫిల్మ్‌లో సైతం కనిపించారు.
12/22
త్రిష పెళ్లి వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాగా.. అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి.
13/22
ఈ వార్తలు కూడా అలాగే మిగులుతాయా? నిజంగానే పెళ్లి చేసుకుంటారా? వేచి చూడాల్సిందే.
14/22
అయితే, తనకు పెళ్లిపై నమ్మకం లేదని గతంలో ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు పెళ్లయినా.. కాకపోయినా పర్వాలేదని చెప్పింది.
15/22
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో కనిపించింది.
16/22
ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నది. థగ్‌లైఫ్ మూవీలో కమల్ హసన్‌తో జతకడుతున్నది.
17/22
అలాగే, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర మూవీలో హీరోయిన్గా నటిస్తున్నది.
18/22
స్టాలిన్ తర్వాత చిరుతో మళ్లి రొమాన్స్ చేయబోతున్నది.
19/22
అలాగే, సూర్య-45 మూవీలో నటిస్తుండగా.. మలయాళంలో ‘రామ్’ చిత్రాల్లో నటిస్తుంది.