Trisha | చెన్నై చంద్రం త్రిష టాలీవుడ్ ప్రేక్షకులని సైతం ఎంతగానో అలరించింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ అమ్మడు ఇప్పటికీ టాప్ లీగ్‌లో కొనసాగుతుంది.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర అనే చిత్రం చేస్తుంది. సాధారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో అవకాశాలు రావడం చాలా అరుదు. కాని త్రిష మాత్రం అద్భుతమైన అవకాశాలు అందుకుంటుంది
ఇప్పుడు కేవలం సీనియర్ హీరోలకు జోడీగా మాత్రమే నటిస్తోంది. యంగ్ హీరోలకు నో ఛాన్స్ అంటోంది. ఇటీవలే మాలీవుడ్ లో అడుగుపెట్టింది. 42 వ పడిలోకి అడుగు పెట్టిన కూడా త్రిష అందం ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో త్రిష అందాన్ని పొగిడేస్తూ ఓ నెటి జనుడు మనసులో ప్రేమను బయట పెట్టాడు. గతంలో త్రిషకి ఎన్నో లవ్ ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. కాని ఈ ప్రపోజల్ మాత్రం త్రిష తప్పక అంగీకరించాల్సిందే. అంత గొప్పగా ప్రేమను కురిపించాడు. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా తాజ్ మహాల్ ని కట్టారు. కానీ దాన్ని తలదన్నేలా అంతకు మించిన గొప్ప ప్రేమ మందిరం కట్టాలని నాకు ఉంది.
ఇప్పటికే నా మనసులో అంతకు మించిన గొప్ప మందిరం అయితే కట్టేసాను. కానీ దాన్ని నేను భౌతికంగా చూపించలేను కాబట్టి తాజ్ మహల్ ని మించిన మరో మందిరం కట్టి చూపిస్తాను. అది ఈ జన్మలో సాధ్యం కాకపోయినా వచ్చే జన్మలోనైనా తప్పక కడతానంటూ మన సులో ప్రేమను వ్యక్తం చేసాడు సదరు నెటిజన్. ఇది కనుక త్రిష చూస్తే మైమరిచిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవలే త్రిష నటించిన పొన్నియిన్ సెల్వన్, లియో ,గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో మరోసారి హిట్స్ లైనప్‌లోకి చేరింది.