సన్నీ లియోన్, యోగేష్ కాళ్లే, ఆకృతి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ థ్రిల్లర్ ‘త్రిముఖ’. రాజేష్ నాయుడు దర్శకుడు. శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతలు. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
శక్తివంతమైన కథతో.. మత్రమగ్థుల్ని చేసే కథనంతో.. ఆకట్టుకునే విజువల్స్‌తో ఈ సినిమా రూపొందిందని, ప్రేక్షక హృదయాల్లో గాఢమైన ముద్ర వేసే సినిమా ఇదని, త్వరలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెడతామని మేకర్స్ తెలిపారు. సుమన్, ఆదిత్య శ్రీవాస్తవ, అశురెడ్డి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కొంగ శ్రీనివాస్, సంగీతం: వినోద్ యాజమాన్య, నిర్మాణం: అఖిరా డ్రీమ్స్ క్రియేషన్స్.