శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘త్రికాల’. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక, శ్రీనివాస్ నిర్మాతలు. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘యుద్ధం రేపటి వెలుగు కోసం, కానీ ఈ అంధకాసురుడి యుద్ధం వెలుగుని నాశనం చేయడానికి..’ అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
సైక్రియార్టిస్ట్ పాత్రలో కథానాయిక శ్రద్ధాదాస్ పాత్రను పరిచయం చేశారు. యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ సూపర్‌హీరోల తరహాలో సాగే కథాంశమిదని, కాలంతో సంబంధం లేకుండా ప్రజలను కాపాడేవాడే త్రికాల అని, మన సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశానని నిర్మాత రాధిక పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: షాజిత్ హుమాయున్, హర్షవర్ధన్ రామేశ్వర్, రచన, ఎడిటర్, దర్శకత్వం: మణి తెల్లగూటి.