Tribanadhari Barbarik OTT | నటులు సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా.. సత్యం రాజేశ్, సాంచీ రాయ్, వీటీవీ గణేశ్, క్రాంతి కిరణ్, మేఘన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించగా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం అందించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశను పరిచింది. మరోవైపు ఈ సినిమా డిజాస్టార్ అవ్వడం వలన మనస్థాపం చెందిన దర్శకుడు భావోద్వేగానికి గురవ్వడంతో పాటు తన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని మీడియా ముందే చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో ఈ మూవీ గురించి వైరల్ అయింది. అయితే వివాదాస్పదంగా మారిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక సన్ నెక్స్ట్లో ఈ చిత్రం అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్యామ్ కుమార్ (సత్యరాజ్), పేరుగాంచిన మానసిక వైద్య నిపుణుడు. తన కొడుకు, కోడలు మరణించడంతో, మనవరాలు సుధ (మేఘన)ని అతను ప్రేమగా, జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు. ఒక రోజు సుధ స్కూల్కు వెళ్లిన తర్వాత అదృశ్యమవుతుంది. దీంతో ఆందోళన చెందిన శ్యామ్ వెంటనే పోలీసులను సంప్రదిస్తాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగింది? సుధ అదృశ్యానికి గల కారణం ఏమిటి? ఈ ఊరిలోని రహస్యమైన వ్యక్తి రామ్ (వశిష్ఠ ఎన్. సింహా) లేదా కుఖ్యాత లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను)కు ఈ ఘటనతో ఏదైనా సంబంధం ఉందా? వీరిద్దరూ డబ్బు కోసం చేస్తున్న రహస్య, అక్రమ వ్యవహారాలు ఏమిటి? సుధ మిస్సింగ్ కేసులో దాగిన నిజాలు ఏమిటి? శ్యామ్ తన మానసిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ కేసును ఛేదించగలిగాడా? లేక ఆ రహస్యం అలాగే మిగిలిపోయిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Love, loss & an unbreakable bond — a psychiatrist’s fight to find his granddaughter. Tribanadhari Barbarik, streaming Oct 10 on SunNXT.#SunNXT #SunNXTTribanadhariBarbarik #TribanadhariBarbarik #Sathyaraj #SathyamRajesh #Vasista #Udayabhanu pic.twitter.com/tN1bfI1bvp
— SUN NXT (@sunnxt) October 5, 2025