‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రీకరణ ఎక్కువ రాత్రిపూట, రెయిన్ ఎఫెక్ట్స్‌లోనే జరిగింది. వేసవిలో రెయిన్ సీజన్ ఎఫెక్ట్ తేవడం సులభం కాదు. ఈ విషయంలో చాలా కష్టపడ్డం. నిర్మాత విజయ్ రాజీలేనితనం వల్లే ఇది సాధ్యమైంది.’ అని సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్‌రెడ్డి అన్నారు. ఆయన ఛాయాగ్రహణం అందించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్యరాజ్ టైటిల్ రోల్ చేశారు. మోహన్ శ్రీవత్స దర్శకుడు. అగ్ర దర్శకుడు మారుతి సమర్పణలో విజయ్‌పాల్‌రెడ్డి అడిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్‌రెడ్డి ఆదివారం విలేకరులతో ముచ్చటించారు. ఈ సినిమాలోని ఒక్కో పాత్రకూ ఒక్కో కలర్ గ్రేడింగ్ వాడామని, రెయిన్ ఎఫెక్ట్ సీన్స్ చూస్తే సహజంగా అనిపిస్తాయని, ఇది చాలా గొప్ప కథ అని, అందుకే ఇష్టంతో చేశానని, ఊహించని విధంగా ైక్లెమాక్స్ ఉంటుందని రమేష్‌రెడ్డి తెలిపారు. సత్యరాజ్ పాత్ర హైలైట్‌గా ఉంటుందని, రెయిన్ సీన్స్ కారణంగా ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టామని, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే అరుదైన సినిమా ఇదని రమేశ్‌రెడ్డి చెప్పారు.