Trance of OMI | పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం దే కాల్ హిమ్ ఓజీ (ఓజీ). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్గా నటించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమీ’ (Trance of Omi) అనే ఫుల్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇమ్రాన్ హష్మీ మీద ఈ పాట తెరకెక్కగా.. ఇమ్రాన్ పాత్ర ‘ఓమీ భౌ’ ఎంట్రీని ఈ పాట హైలైట్ చేస్తుంది. అద్వితీయ వోజ్జల ఈ పాటకు లిరిక్స్ అందించగా.. హర్ష దరివేముల, అద్వితీయ వోజ్జల, థమన్ఎస్ కలిసి పాడారు. థమన్ సంగీతం అందించాడు.