Sikandar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) డైరెక్ట్ చేస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. చాలా రోజుల తర్వాత ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.
సల్మాన్ ఖాన్ సినిమాల్లో ట్రైన్ సీక్వెన్స్‌లకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా సికిందర్ సినిమాలో మరోసారి అలాంటి మేనియా క్రియేట్ చేయబోతున్నాడు సల్లూభాయ్. తాజా సమాచారం ప్రకారం ముంబైలో సికిందర్‌కు షూటింగ్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్ మంగళవారం మొదలు కాగా ఐకానిక్ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. సల్మాన్ ఖాన్ అండ్ గ్యాంగ్‌పై వచ్చే ఈ సీన్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందని టాక్.
సికిందర్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. డైరెక్టర్ మురుగదాస్ ఓ వైపు ఎమోషన్స్‌ను హైలెట్ చేస్తూనే.. మరోవైపు హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో సికిందర్‌ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
LATEST: Mid-Day Sources say MegaStar #SalmanKhan has begun the Mumbai leg of his upcoming film #Sikandar with an ambitious action sequence set aboard a train. pic.twitter.com/rh55ruBk1Z
— Sikandar | Eid 2025 (@SikandarVerse) November 28, 2024
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్